Monday, November 17, 2008

వేమన శతకం - నాల్గవ బాగం

ఎలుక తోలు తెచ్చి ఏడాది యుతికిన
నలుపు నలుపే గాని తెలుపు గాదు
కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: ఎలుకతోలు అదేపనిగ సంవత్సరముతికినను తెల్లపడదు. అట్లే చెక్క బొమ్మ తెచ్చి కొట్టినను మాట్లాడదు.
-------౦౦౦-------

గంగి గోవు పాలు గరిటె డైనను జాలు
కడవెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: గాడిద పాలు ఒక కుండ కంటే చిక్కని ఆవుపాలు గరిటెడు మేలైనట్లుగా భక్తితో చేసిన కూడు పట్టెడు చాలును కదా!
-------౦౦౦-------

కుండ కుంభమన్న కొండ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటికాదె
భాషలిట్టే వేరు పరతత్వమొక్కటే
విశ్వదాభిరామ వినురవేమ.

బావం: కుండ-కుంభము, కొండ-పర్వతము, ఉప్పు-లవణము అర్థమొక్కటే, భాషలు వేరైనా పరతత్వమొకటె కదా!

2 comments:

CodeNameV said...

Seetiah, telugu bhasha mida neekunna abhimanam malli chati cheppav......cinema bhasha lo cheppalante....kummav....neeku inka padyala pusthakala erpatulo nenu padatanu.....manakunna goppa varam padyam.....kavithvam ekkadainaa undi....kani padyam oka mana samskruti lone undi....daani ila andaru chaduvukune laga nuvvu samarpinchatam naaku chala anandanni kaliginchindi

oka chinna vishayam....maa telugu talli ki mallepudanda pata rasindi Sri Krishna Devarayalu kadu....Keerthiseshulu Sankarambadi Sundaracharyulu
http://www.sirigina.com/telugu/detail.asp?S=3&A=1&P=1

....inkoka chinna vishayam....kudirithe aa pata ni nuvvu audio load cheyyi...cinemala lo unna pata laa kakundaa....lalitha sangeetha kalakarulu evarainaa padinadi dorukutundemo prayatninchu....nenu kuda kudirinapudu vetukutanu....dorikithe neeku cheptanu

శ్రీధర్ రెడ్డి said...

శర్మ గారు ,

నేను మా తెలుగు తల్లికి ... పద్యం రాసింది శ్రీ శంకరంబాడి సుందరాచారి అని తెలుసు , కానీ ఆ గేయం ... ఆ తెలుగుతల్లి బొమ్మ క్రింద వచ్చే విదంగా ప్రచురించా ... తర్వాత గేయకర్త ప్రెు ప్రచురించడం మరిచా..... కానీ ఆ ప్రచురణ విదానం లో లోపం వల్ల నీకు అవి రెండు వేరు గా అచ్చు అయ్యాయు .. ఆ లోపాన్ని ఇప్పుడు సరిచేసాను .. ఇలాగే ఇంకేమైనా పొరపాట్లు ఉంటే తెలియచేయవలసిందిగా మనవి.