అంతరంగమందు నపరాధములు చేసి
మంచివానివలెనె మనుజుడుండు
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ.
బావం :: మోసకారి ఆయున మనుజుడు తన అంతరంగమందు మిక్కిలి అపరాధములు చేసినను కూడా బాహ్య ప్రపంచముకు చాలా బుద్డిమంతుని వలె కనిపించును. ఈ విషయం ఇతరులు గ్రహించలేకపోయునప్పటికీ ఈశ్వరుడు తప్పకుండా గుర్తిస్తాడు.
-------౦౦౦-------
కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులవ పదవిగొన్న దొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ.
బావం :: గొప్ప గొప్ప ఆభరణములతో అలంకరించినా కళ్ళుకుండ నుంచి వచ్చే వాసన బాగుండాదు కదా! చెడ్డవాడు ఉన్నత పదవులు అలంకరించినా గుణం మారదు.
-------000-------
కానివాని తోడ గలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకిగూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ.
బావం :: అర్హత లేనివారితో స్నేహం చేయడంవల్ల ఎంత గొప్పవారికైనా కష్టాలు కలుగుతాయి. కాకితో మితృత్వం చేసి హంస కష్టాలపాలు ఆయునట్టు.
No comments:
Post a Comment