Wednesday, January 21, 2009

సుమతీ శతకం - నాల్గవ బాగం

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
‌మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ.

బావం : భూమియందు ధనము నొసగునదియే విద్య. యుద్ధభూమియందు ప్రవేశించునదే పౌరుషము. మంచి కవిశ్రేష్టులు మెచ్చుకున్నట్టిదే నేర్పరితనము. తగవునకు వచ్చునదియే హాని.
-------000-------

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్‌,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ.

బావం : ఇంపుగా పఠింపని నోరును, అమ్మయని పిలచి అన్నము అడుగనినోరును, తమ్ముడాయని పిలువనినోరును, కుమ్మరివాడు మన్నుత్రవ్విన గోయీవంటిది సుమా.
-------000-------

ఉడుముండదె నూరేండ్లును,
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్‌,
మడువున గొక్కెర యుండదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ

బావం : ఉడుము నూరేండ్లును, పాము పదివందల ఏండ్లును, కొంగ చెరువులో చిరకాలము జీవించుచున్నవి.వాని జీవితములన్నియు నిరుపయోగములు. మానవుని జీవిత మట్టిదికాక ధర్మార్ధకామ మోక్షాసక్తితోకూడినది కావలెను.

3 comments:

ఆత్రేయ కొండూరు said...

శ్రీధర్ గారు మంచి ప్రయత్నం చేస్తున్నారు. అభినందనలు.

శ్రీధర్ రెడ్డి said...

@ఆత్రేయ గారు,

కృతజ్ఞతలు ,...

నాకు తెలిసిన మిత్రులు తక్క మీరే మొదటగా నా బ్లాగు ని చదివినట్టు ఉన్నారు.

computers said...

శ్రీధర్ గారు, మి ఫోన్ number ఇవ్వగలరా ??